![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -399 లో.. ముకుంద శోభనం గది నుండి సర్ ప్రైజ్ తీసుకొని వస్తానంటు బయటకు వస్తుంది. ఇప్పుడైతే తప్పించుకున్నాను. ఎలా ఈ ప్రాబ్లమ్ నుండి బయటకు రావాలని ముకుంద ఆలోచిస్తుంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి, ఆదర్శ్, కలిసి ముకుంద రావడం లేదని తనకోసం బయటకు వస్తారు.
ఆ తర్వాత ముకుంద ఏదో ఒకటి చెయ్యాలని అనుకొని చెట్టుపై పూలు తెంపుతున్నట్లు చేసి.. కింద పడిపోతుంది. అది చూసి మురారి, ఆదర్శ్ లు వస్తారు. కాలు బెనికిందా అని అడుగుతారు. ముకుంద నటిస్తు నొప్పిగా ఉందని అనగానే.. ఆదర్శ్ ముకుందని ఎత్తుకొని గదిలోకి తీసుకొని వెళ్తాడు. మరొకవైపు నాకు ముకుంద మారిందంటే ఇంకా నమ్మాలనిపించడం లేదని రేవతితో మధు అంటాడు. వీడేంటి తినకుండా మరి ఆలోచిస్తున్నాడంటే నిజంగానే వీడనేది నిజమేనా అని రేవతి అనుకుంటుంది. ఆ తర్వాత ముకుందని రూమ్ లోకి తీసుకొని వచ్చాక.. ఏంటి ముకుంద.. ఆదర్శ్ హెల్ప్ తీసుకుంటే బాగుండేది కదా అని కృష్ణ అంటుంది. చాలా నొప్పిగా ఉందని ముకుంద అంటుంది. ముకుంద కావాలనే శోభనం ఇష్టం లేక ఇలా చేసిందా అని కృష్ణకి డౌట్ వస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు కృష్ణ ఎక్కడికి వెళ్ళకని ముకుంద అంటుంది. దాంతో మురారి ఆదర్శ్ ఇద్దరు వేరే రూమ్ కి వెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ వస్తానంటు కృష్ణ బయటకు వెళ్తుంటుంది. కాసేపటికి ముకుందకి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ సోఫాలో ఉండడంతో ముకుంద వెళ్లి ఫోన్ తీసుకుంటుంది. అప్పుడు కృష్ణ చూడగానే మళ్లీ నొప్పి అంటూ యాక్ట్ చేస్తుంది. అలవాటులో నొప్పి ఉన్న విషయం మర్చిపోయి వెళ్ళాను నొప్పిగా ఉందంటు కవర్ చేస్తుంది ముకుంద.
మరుసటి రోజు ఉదయం కృష్ణ, మురారి ఇద్దరు మాట్లాడుకుంటారు. అసలు ముకుంద కావాలనే ఇలా చేస్తుందని కృష్ణ మనసులో అనుకుంటుంది. అప్పుడే ముకుందని ఆదర్శ్ నడిపిస్తు తీసుకొని వస్తుంటాడు. అంత పెయిన్ ఉంటే తెల్లవారే ఇలా నడుస్తుందా అని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత ముకుంద ఇక్కడ నుండి వెళ్లి పోదామని అంటుందని ఆదర్శ్ చెప్తడు. సరే వెళదామని మురారి అంటాడు. ముకుందకి ఇష్టం లేదని నేను ఇప్పుడే అనుకోవద్దు ఇంకా కొన్ని టెస్ట్ లు పెట్టి కన్ఫర్మ్ చేసుకోవాలని కృష్ణ అనుకుంటుంది. తరువాయి భాగంలో పంతులు గారితో కృష్ణ చెప్పి.. ముకుంద ఆదర్శ్ ల పేరు మీద మాత్రమే రేపు శోభనానికి ముహూర్తం ఉందని పంతులుగారితో చెప్పిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |